1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

వైవిధ్య కథాంశంతో తెరకెక్కనున్న"గాయత్రి"

వినోదం వెండితెర కథనాలు వైవిధ్య కథాంశం తెర గాయత్రి భూషణ్ గాయత్రిరావు సాయేంద్ర రెడ్డి సురేందర్ రెడ్డి చక్రి రీరికార్డింగ్
భూషణ్, గాయత్రిరావు హీరోహీరోయిన్లుగా సాయేంద్రరెడ్డి దర్శకత్వంలో "గాయత్రి" చిత్రం రూపొందుతోంది. లక్ష్మీభవానీ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తెరపైకి రానున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది.

గాయత్రి అనే పేరుగల కథానాయిక పాత్ర చుట్టూ ఈ చిత్రం తిరుగుతుందని దర్శకుడు వెల్లడించారు. వైవిధ్యమైన కథాంశంతో గాయత్రిని చిత్రిస్తున్నామని ఆయన తెలిపారు. రీరికార్డింగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు.

ఇంకా ఈ చిత్రానికి సంగీతం.. చక్రి, కెమెరా.. సురేందర్ రెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. డి. సాయేంద్రరెడ్డి.
About Writer
SELVI.M