ప్రేమకథా నేపథ్యంలో రామ్ కొత్త చిత్రం
స్రవంతి మూవీస్ పతాకంపై రెడీ ఫేమ్ "రామ్" హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. జయభేరి ఎన్‌క్లేవ్‌లోని అపార్ట్‌మెంట్‌లో దాదాపు 40 రోజుల పాటు షూటింగ్‌ను జరుపనున్నారు. నిరాడంబరంగా చిత్రాన్ని పూర్తిచేసి ఆ తర్వాత మీడియా ముందుకు రావాలన్నది నిర్మాత రవికిషోర్ ఆలోచన.
ఈ చిత్రంలో రామ్ సరసన అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ నటిస్తోంది.
ఆమె ఉండే ఇంటి సన్నివేశాలు, హీరో కూడా తన అక్కకోసం వచ్చి అదే అపార్ట్‌మెంట్‌లో ఉండటం వంటి మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. పూర్తిస్థాయి ప్రేమకథతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసింది.
ఈ చిత్రానికి శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తమిళ దర్శకుడు శంకర్ దగ్గర అసోసియేట్‌గా శరవణన్ పనిచేశాడు. ఈ సినిమాను ద్విభాషా చిత్రంగా మలుస్తున్నట్లు సమాచారం. ఇంకా ఈ చిత్రానికి కెమేరా.. హరి అనుమోలు.