ప్రభాస్ "భిల్లా"లో హన్సిక డాన్స్!
ప్రభాస్, అనుష్క, నమిత నాయకా నాయికలుగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం "భిల్లా". "కంత్రి" ఫేమ్ మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, గోపీకృష్ణా మూవీస్ పతాకంపై రెబల్ స్టార్ కృష్ణంరాజు నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. స్టన్ శివ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వారం రోజుల పాటు జరిగే షూటింగ్‌కు అనంతరం ఈ సినిమా పాటలను చిత్రీకరించనున్నారు.
అంతర్జాతీయ స్మగ్లర్‌గా ప్రభాస్, ఆయన్ను పట్టుకునే ఆఫీసర్‌గా కృష్ణంరాజు నటిస్తున్నారు. ఇందులో హన్సిక ప్రత్యేక గీతంలో నర్తించనుంది. ఆమెకోసం ఎక్కువ ఆఫర్ చేసినట్లు తెలిసింది. సెంటిమెంట్ రీత్యా హన్సిక హిట్ అనేది కూడా దానికి కారణమని సినీ వర్గాల్లో టాక్. ఇంకా ఈ చిత్రానికి సంగీతం.. మణిశర్మ.