1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

వైవిధ్యమైన కథాంశంతో "ఆకాశరామన్న"

వినోదం వెండితెర కథనాలు వైవిధ్యం కథాంశం ఆకాశరామన్న అల్లరినరేష్ శివాజీ రాజీవ్ కనకాల మీరాజాస్మిన్ గౌరిపండిట్
WD
అల్లరినరేష్, శివాజీ, రాజీవ్ కనకాల హీరోలుగా, మీరాజాస్మిన్, గౌరిపండిట్ హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "ఆకాశరామన్న". ఫ్లాష్‌న్యూస్ ఫేం అశోక్ దర్శకత్వంలో మన్యం సూర్యనారాయణ సమర్పణలో మన్యం రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మిగిలిన రెండు పాటలను ఈ నెల ఆరోతేదీ నుంచి రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా మన్యం రమేష్ మాట్లాడుతూ.. రెండుపాటలను ఈ నెల ఆరోతేదీ నుంచి ఫిలింసిటీలో చిత్రీకరిస్తున్నామని చెప్పారు. పూర్తి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఈ నెలాఖరులోగానీ, వచ్చేనెలలోగానీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని రమేష్ వెల్లడించారు.

ఇంకా ఈ చిత్రంలో రావురమేష్, టార్జన్, రఘు, ఖయూం, వేణు, సన, గీతాసింద్, బండజ్యోతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమేరా.. శ్రీరామ్, సంగీతం.. చక్రి, మాటలు.. చంద్రశేఖర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. అశోక్.
About Writer
SELVI.M