అనిల్ అంబానీ చేతిలో "కైట్స్"
రాకేష్ రోషన్ నిర్మిస్తున్న "కైట్స్" చిత్రం హక్కులను అనిల్ అంబానీకి చెందిన బిగ్ పిక్చర్స్ సంస్థ 110 కోట్లరూపాయలు చెల్లించి కొనుగోలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంతో బాలీవుడ్ రంగం అతలాకుతలమౌతోందని ఆ వర్గాలు భావిస్తున్నాయి. కానీ గతంలో ఎన్నడూ లేనంతగా అంబానీ గ్రూపు ఇంత మొత్తాన్ని వెచ్చించి ఈ సినిమా హక్కులను కొనుక్కొవడం సంతోషదాయకమని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
నిరుడు అమీర్ ఖాన్ నటించిన సినిమా 94 కోట్ల రూపాయలకు, అక్షయ్ కుమార్ సినిమా సింగ్ ఈజ్ కింగ్ హక్కులు 65 కోట్ల రూపాయలకు విక్రయించారు.
ఇదిలావుండగా కైట్స్ సినిమా అంతర్జాతీయ హక్కుల్లో కొంత వాటా రాకేష్ రోషన్‌కు కూడా అందుతుందని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.