1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

రవితేజ-బోయపాటి కాంబినేషన్‌లో కొత్త చిత్రం

వినోదం వెండితెర కథనాలు రవితేజ బోయపాటి కాంబినేషన్ నిర్మాత గణేష్బాబు పవన్కళ్యాణ్ పూరీ జగన్నాథ్ ప్రొడక్షన్ నెంబర్2
WD
క్రేజీస్టార్ రవితేజ కథానాయకుడిగా హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. నటుడు, నిర్మాత గణేష్‌బాబు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో సెన్సేషనల్ మూవీని ప్లాన్ చేసిన గణేష్‌బాబు... రవితేజ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై "ప్రొడక్షన్ నెంబర్ 2"గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, భద్ర, విక్రమార్కుడు, కృష్ణ వంటి సూపర్‌హిట్ చిత్రాల హీరో రవితేజ, భద్ర, తులసి వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాకు ఇప్పటికే సబ్జెక్ట్‌ రెడీ అయింది.

ఈ చిత్రం గురించి నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ.. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మార్చి 3వ వారంలో ప్రారంభమౌతోందన్నారు. ఏకధాటిగా జరిగే సింగిల్ షెడ్యూల్‌తో ఈ సినిమా పూర్తవుతుందని, భారీ తారాగణంతో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాత వెల్లడించారు.

ఇకపోతే.. "భద్ర" వంటి సూపర్‌హిట్ తర్వాత రవితేజ, బోయపాటి శ్రీను కలిసి చేస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ బాబు కాంప్రమైజ్ అవకుండా నిర్మిస్తున్నారు. ఓ అగ్రకథానాయిక ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇంకా ఈ చిత్రానికి సమర్పణ.. రవికిరణ్ బాబు, నిర్మాత.. గణేష్ బాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. బోయపాటి శ్రీను.
About Writer
SELVI.M