"స్లమ్డాగ్ మిలీనియర్"కు బ్రిటీష్ అవార్డుల పంట
|
ఇందులో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్, స్క్రీన్‌ప్లే విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. దీంతో భారత సంగీత మేధావి ఏఆర్.రెహ్మాన్ ఉత్తమ సంగీత అవార్డును కైవసం చేసుకున్నాడు.
ఈ చిత్రం కథ పూర్తిగా జమల్ మాలిక్ చుట్టూ నడుస్తుంది. ఈ పాత్రను దేవ్ పటేల్ పోషించాడు. ఈ ఫిల్మ్‌స్టార్‌కు బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, ఇర్ఫాన్ ఖాన్‌లు సుపరిచితులు. ఈ 18 సంవత్సరాల దేవ్ పటేల్ ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకున్నాడు.
ఈ చిత్రంలో పటేల్ నటనపై ప్రశంసల జల్లు కురుస్తున్న విషయం తెల్సిందే. అయితే పటేల్‌కు సహాయ నటుడిగా నటించి ఫ్రైదా పింటో మాత్రం సహాయ నటుడి అవార్డును గెలుచుకోలేక పోయాడు. కాగా, ఇప్పటికే కాలిఫోర్నియా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను ఈ చిత్రం కైవసం చేసుకున్న విషయం తెల్సిందే.