1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

కనీసం ఒక్క ఆస్కారైనా వస్తుంది: రెహ్మాన్

రెహ్మాన్ బ్రిటీష్ అవార్డు ఆస్కార్ చిత్రం స్లమ్డాగ్ మిలీనియర్ దైవ అనుగ్రహం
FileFILE
ఇండియన్ మ్యూజిక్ మాస్ట్రో ఏ.ఆర్.రెహ్మాన్ తన మనస్సులోని మాటను వెల్లడించారు. "స్లమ్‌డాక్ మిలీనియర్" చిత్రానికి తనకు వచ్చిన రెండు నామినేషన్లలో కనీసం ఒక్కదానికైనా ఆస్కార్ అవార్డు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇదికూడా దైవాధీనంపై ఆధారపడి ఉంటుందన్నారు. కనీసం ఒక్క ఆస్కారైనా గెలుస్తామని నేను భావిస్తున్నా. ఇందుకోసం తాను వేచి చూడటం లేదని ది డైలీ టెలిగ్రాఫ్‌కు సోమవారం రెహ్మాన్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

గతంలో ఇద్దరే ఇద్దరు భారతీయులు మాత్రమే ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నారు. వీరిలో కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథయా (గాంధీ చిత్రం-1982)కాగా, 1992లో లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ ఆస్కార్ అవార్డును బెంగాలీ ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రేకు దక్కింది. కాగా, ఈ దఫా 'స్లమ్‌డాగ్ మిలీనియర్' చిత్రానికి మూడు అకాడెమీ అవార్డు నామినేషన్లు దక్కిన విషయం తెల్సిందే. వీటిలో ఒకటి మొత్తం చిత్రానికి కాగా, మరో రెండు నామినేషన్లు రెండు పాటలకు దక్కింది.

ఈ నేపథ్యంలో చెన్నయ్‌కు చెందిన రెహ్మాన్ మూడో ఆస్కార్ ఆవార్డును గెలుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, బ్రిటీష్ ప్రభుత్వం ఇచ్చే బాఫ్టా అవార్డుల్లో ఉత్తమ సంగీత అవార్డును కూడా ఆదివారం రెహ్మాన్ గెలుచుకున్నారు. ఈ అవార్డును అందుకున్న రెహ్మాన్ మాట్లాడుతూ.. ఈ అవార్డు కోసం తాము గత 80 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. తనకు ఏది లభించిన అది దైవ అనుగ్రహంతోనే సమకూరుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.
About Writer
PNR