1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"అష్టాచమ్మా" నాని హీరోగా కొత్త చిత్రం

వినోదం వెండితెర కథనాలు అష్టాచమ్మా నాని నచ్చావులే మాధవీలత జెమినీ ఫిల్మ్స్ సర్క్యూట్ శంకర్దాదా ఎంబిబిఎస్
WD
చిరంజీవితో శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్, జిందాబాద్ చిత్రాల్ని నిర్మించిన జెమినీ ఫిల్మ్స్ సర్క్యూట్ తాజాగా ఓ చిత్రానికి శ్రీకారం చుట్టింది. జెమినీ సర్క్యూట్ సమర్పణలో సత్య ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ నిరాడంబరంగా ప్రారంభమైంది. "అష్టాచమ్మా" ఫేమ్ నాని, "నచ్చావులే" ఫేమ్ మాధవీలత ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి.. సత్యం బెల్లంకొండ దర్శకునిగా పరిచయమవుతున్నారు. శివశంకర్ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు.

నిర్మాత మాట్లాడుతూ.. ప్రేమతో కూడిన వినోదాత్మక చిత్రంగా రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ వరకు జరిగే షూటింగ్‌తో చిత్రాన్ని పూర్తి చేసి, మేలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, సుత్తివేలు, నాజర్, నర్సింగ్ యాదవ్, సుభాషిణి, పావలా శ్యామలా తదితరులు నటిస్తున్నారు. మాటలు.. భాషా శ్రీ, కెమేరా.. వాసు. ఆర్ట్... సురేష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. సత్యం బెల్లంకొండ.
About Writer
SELVI.M