1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

సంగీతనేపథ్యంలో "కలవరమాయె మదిలో"

వినోదం వెండితెర కథనాలు సంగీతనేపథ్యం కలవరమాయె మదిలో లవ్ ఫ్యామిలీ డ్రామా కలర్స్ స్వాతి కలమ్కామరాజ్ జయసుధ
WD
సంగీతనేపథ్యంలో, లవ్, ఫ్యామిలీ డ్రామాతో "కలవరమాయె మదిలో" చిత్రం రూపొందుతోంది. ఇందులో "అష్టాచమ్మా" ఫేమ్ కలర్స్ స్వాతి, కలమ్‌కామరాజ్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, విక్రమ్ గోఖలే, భరణి, జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కె. సతీష్ దర్శకత్వంలో... మోహన్ మీడియా క్రియేషన్స్ పతాకంపై మోహన్‌వడ్లపట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఈ నెల 2 నుంచి హైదరాబాద్‌లో జరుగుతోంది. ఏప్రిల్ వరకు జరిగే షెడ్యూల్తో చిత్రాన్ని పూర్తిచేస్తామని నిర్మాత చెప్పారు. తమ బేనర్‌లో ఇది ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.

కథపై పూర్తి తమకు నమ్మకముందని, ఈ చిత్రం ద్వారా కెమేరామెన్ రాజేంద్ర, సంగీత దర్శకుడు శరత్ వాసుదేవన్, నటుడు విక్రమ్ గోఖలేలు కొత్తగా పరిచయమవుతున్నారని నిర్మాత వెల్లడించారు. మంచికథాంశంతో "కలవరమాయెమదిలో" చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశించారు.
About Writer
SELVI.M