ప్రయోగాత్మకంగా "మగధీర" ఆడియో: సుప్రీం రాజు
|
ఈ విషయమై సోమవారం నాడు ఆయన మాట్లాడుతూ.. పైరసీకారులకు ధీటుగా వైవిధ్యమైన రీతిలో చిరంజీవి తనయుడు రామచరణ్ తేజ నటించిన "మగధీర" ఆడియోను విడుదలచేస్తున్నామని చెప్పారు. అది ఎలా అనేది విడుదల తర్వాత మీకే తెలుస్తుందని రాజు అన్నారు. ప్రభుత్వం పైరసీపై సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే ఆడియోవల్ల నిర్మాతకు చాలా కష్టం చేకూరుతుందన్నారు.
ఓవర్‌సీస్ వ్యాపారంలో ప్రవేశించాం...
ప్రస్తుతం సుప్రీం సంస్థ "బ్లూ స్కై సినిమా" పేరుతో ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ ప్రవేశించిందని సుప్రీం రాజు వెల్లడించారు. అది కూడా "మగధీరుడు"తోనే ఈ వ్యాపారాన్ని ఆరంభిస్తున్నామని చెప్పారు. అందరూ పెద్ద చిత్రాలపై వ్యాపారం చేస్తున్నారని, తాము మాత్రం చిన్న చిత్రాలను కూడా ప్రమోట్ చేయబోతున్నామని ఆయన వివరించారు. అదేవిధంగా గతంలో సుప్రీం ఎంటర్‌టైన్‌మెంట్ పై "అస్త్రం" చిత్రాన్ని నిర్మించామని రాజు గుర్తుచేశారు.
ఇదిలా ఉండగా.. మార్చిలో తరుణ్ హీరోగా రాజా ఆదిత్య దర్శకత్వంలో ఓ కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తున్నామని రాజు చెప్పారు. ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదని, ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన చెప్పారు.