1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

16న బాలీవుడ్‌ బాద్‌షాకు శస్త్రచికిత్స!

బాలీవుడ్ అగ్రహీరో షారూక్ ఖాన్కు ఈనెల 16వ తేదీన దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని బ్రీచ్కాండీ
FileFILE
బాలీవుడ్ అగ్రహీరో షారూక్ ఖాన్‌కు ఈనెల 16వ తేదీన దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరుగనుంది. గత సంవత్సరం నవంబర్‌లో 'దుల్హాన్ మిల్ గయే' అనే చిత్రం షూటింగ్ సెట్స్‌లో షారూక్‌ గాయపడిన విషయం తెల్సిందే. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. వైద్యుల సలహా మేరకు ఇప్పటికే ఆయనకు ఆపరేషన్ జరగాల్సి ఉంది.

అయితే.. బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన శస్త్ర చికిత్సను వాయిదా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌లో విరామం లభించడంతో ఈనెల 16వ తేదీన ఆపరేషన్ చేయించుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఆపరేషన్ తర్వాత షారూక్ భుజం మళ్లీ పూర్తి సామర్థ్యం పుంజుకోవాలంటే కనీసం రెండు మూడు నెలల సమయం పడుతుందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

అయితే ఏప్రిల్‌లో ప్రారంభంకానున్న ఐపిఎల్ రెండో సీజన్ సమయానికి షారూక్ బాగా కోలుకుంటారని భావిస్తున్నారు. ఐపీఎల్‌లోని ఫ్రాంఛైజీలలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టుకు షారూక్ అధిపతిగా ఉన్న విషయం తెల్సిందే. కాగా, షారూక్ సొంతంగా నిర్మించిన 'బిల్లూ బార్బర్' చిత్రం ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా, గతంలో కూడా షారూక్ మోకాలికి ఆపరేషన్, స్పైనల్ ఆపరేషన్ జరిగాయి. ఈ రెండు ఆపరేషన్లు విదేశాల్లో జరుగగా, ప్రస్తుతం స్వదేశంలోనే నిర్వహించుకునేందుకు ఆయన సమ్మతించడం గమనార్హం.
About Writer
PNR