1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

కొత్త ప్రియురాలితో రష్దీ చెట్టాపట్టాల్

ప్రియురాలు రష్దీ పియా గ్లెన్ అమెరికా
వివాదాస్పద రచనలతో పాఠకుల హృదయాలను కొల్లగొట్టే రచయిత సల్మాన్ రష్దీ అమ్మాయిల హృదయాలను జయించడంలోనూ దిట్ట అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈ నవ మన్మధుడు 61 ఏళ్లలోనూ కొత్త ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరగగలుగుతున్నారు.

ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం సదరు భార్యలకు విడాకులు ఇవ్వడం కూడా చేసేసిన రష్దీ తాజాగా పియా గ్లెన్ అనే అనే ఓ అందమైన అమ్మాయితో కలిసి తిరుగుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న రష్దీ ఇటీవల ఓ కార్యక్రమానికి తన స్నేహితురాలు గ్లెన్‌తో కలిసి దర్శనమిచ్చారు. దీంతో రష్దీని చుట్టుముట్టిన విలేకరులు గ్లెన్ ఎవరంటూ ప్రశ్నిస్తే అసలు విషయం చెప్పకుండా దాటేశారు.

అయితే గ్లెన్ మహా ప్రతిభా సంపన్నురాలు అంటూ ఓ సర్టిఫికేట్ మాత్రం ఇచ్చేశారు. దీంతో రష్దీ యొక్క కొత్త ప్రియురాలు గ్లెన్ అని తేలిపోయినట్టేనని అక్కడున్నవారు కూడా ఓ నిర్ధారణకు వచ్చేశారు. మొత్తానికి 61ఏళ్ల వయసులో తనకంటే 29ఏళ్లు చిన్నదైన అమ్మాయితో తిరుగుతున్న రష్దీని చూస్తే మనసు యవ్వనంగా ఉండాలేగానీ ప్రియురాలి మనసు దోచుకోవడానికి వయసు అడ్డం కాబోదని అన్పించడం లేదూ... ?
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT