రేపు నంది అవార్డుల ప్రదానం
|
ఉత్తమ చిత్రంగా 'మీ శ్రేయోభిలాషి', ద్వితీయ ఉత్తమ చిత్రంగా 'హ్యాపీడేస్', తృతీయ ఉత్తమ చిత్రంగా 'లక్ష్యం', ఉత్తమ కుటుంబ కథాచిత్రంగా 'చందమామ', ఉత్తమ వినోదాత్మక చిత్రంగా 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' చిత్రాలు ఎంపికయ్యాయి. అలాగే ఉత్తమ నటుడుగా విక్టరీ వెంకటేష్ (ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే), ఉత్తమ దర్శకుడుగా కృష్ణవంశీ (చందమామ), ఉత్తమ నటిగా ఛార్మి (మంత్ర)లు ఎంపికయ్యారు.
అలాగే ఉత్తమ సహాయ నటుడు అవార్డును జగపతి బాబు (లక్ష్యం), ఉత్తమ సహాయ నటిగా శ్రీమతి జానకి (అమూల్యం), ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా ఆహుతి ప్రసాద్ (చందమామ), ఉత్తమ హాస్య నటుడుగా ఉత్తేజ్ (చందమామ), ఉత్తమ హాస్యనటి అవార్డును ఝాన్సీ (తులసి), ఉత్తమ విలన్‌గా మురళీశర్మ (అతిథి)లు అవార్డులు అందుకోనున్నారు. అలాగే వివిధ విభాగాల్లో పలువురు నటీనటులు అవార్డులు అందుకోనున్నారు.