1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

మదర్ సెంటిమెంట్‌తో కొత్త చిత్రం

వినోదం వెండితెర కథనాలు హనీషా మూవీస్ శేఖర్ విమలారామన్ మదర్ సెంటిమెంట్ ప్రేమకథ ఎపి రవికాంత్
WD
హనీషా మూవీస్ పతాకంపై శేఖర్, విమలారామన్ హీరోహీరోయిన్లుగా నూతన చిత్రం ప్రారంభమైంది. ప్రేమికులను పెద్దలు విడగొడతారు.. ఆ తర్వాత ఆ ప్రేమికులు కలుసుకుంటారు. ఇదే కథాంశంతో.. ఆ ప్రేమికులు ఎలా కలుసుకున్నారు? అనే అంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని చిత్ర దర్శకుడు ఎ.పి. రవికాంత్ అన్నారు.

యాక్షన్ ఆధారిత కథాంశంతో.. తయారయ్యే ఈ చిత్రంలో మదర్ సెంటిమెంట్‌కూడా ఉందన్నారు. ఈ నెలాఖరులో షూటింగ్‌ను ప్రారంభించి, జూన్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని ఆయన వివరాలందించారు.

విమలారామన్ మాట్లాడుతూ.. "ఎవరైనా ఎప్పుడైనా" తర్వాత తెలుగులో చేస్తున్న చిత్రమిదన్నారు. మంచి కథాంశంతో కూడుకున్న ఈ చిత్రానికి సంగీతం.. చిన్ని చరణ్, కెమేరా.. రమణరాజు, నిర్మాతలు.. జ్యోతి రవీంద్ర, శ్రీనివాసరాజు, పి. శ్రీనివాసులు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. ఎ.పి. రవికాంత్
About Writer
SELVI.M