1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఫిక్కీ-ఐఐఎఫ్ఎ అవార్డు వేడుకలో "బిగ్ బి"కి సన్మానం

వినోదం వెండితెర కథనాలు ఫిక్కీఐఐఎఫ్ఎ అవార్డు వేడుక బిగ్ బి సన్మానం ఐశ్వర్యారాయ్ కరీనా కపూర్ ప్రియాంక చోప్రా ప్రీతి జింటా శిల్పాశెట్టి అమీర్ ఖాన్ షారూఖ్ ఖాన్ అక్షయ్ కుమార్ హృతిక్ రోషన్
PTI

పదవ ఫిక్కీ-ఫ్రేమ్ మరియు ఐఐఎఫ్ఎ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన అవార్డు వేడుకలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు ఘన సత్కారం లభించింది. అమితాబ్‌తో పాటు టాప్-10 బాలీవుడ్ సినీతారలను కూడా ఈ అవార్డు వేడుక సన్మానించింది.

మంగళవారం రాత్రి ముంబైలో జరిగిన ఈ అవార్డు ఫంక్షన్‌లో బాలీవుడ్ అందాల రాశులు ఐశ్వర్యారాయ్, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, ప్రీతి జింటా, శిల్పాశెట్టి, అగ్ర హీరోలు అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్‌లు ఫిక్కీ ఐఐఎఫ్ఎ అవార్డులను సొంతం చేసుకున్నారు.

ఇదేవిధంగా... ఫిక్కీ-యుఎస్ఐబిసి (యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్) అవార్డును హాలీవుడ్ సినీ నటుడు డానీ గ్లోవర్ మరియు కాంగ్రెస్ నేత జాన్ లివీస్ కైవసం చేసుకున్నారు.

ఈ నెల ఐదో తేదీతో 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అమితాబ్ బచ్చన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినీరంగంలో తాను ఒక కళాకారుడు కావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఫిక్కీ అవార్డులను గెలుచుకున్న సినీతారలకు అమితాబ్ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. హాలీవుడ్ నటుడు డానీ గ్లోవర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అమితాబ్ గొప్ప నటుడని కొనియాడారు.
About Writer
SELVI.M