1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నేలరాలిన అలనాటి సినీతార నిర్మలమ్మ

వినోదం వెండితెర కథనాలు అలనాటి సినీతార నిర్మలమ్మ కన్నుమూత హైదరాబాద్ గరుడ గర్వభంగం
అలనాటి సినీతార నిర్మలమ్మ హైదరాబాద్‌లోని ఆమె స్వగృహంలో కన్నుమూశారని కుటుంబీకులు వెల్లడించారు. గత కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్న నిర్మలమ్మ, నిద్రలోనే తుదిశ్వాస విడిచారని వారు తెలియజేశారు.

"గరుడ గర్వభంగం" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఆమె, 16 ఏళ్లపాటు చిత్రరంగంలో రాణించారు. తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నిర్మలమ్మ, తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 700 చిత్రాలకు పైగా నటించారు.

1977వ సంవత్సరంలో నిర్మలమ్మ నటించిన "చిల్లరకొట్టు చిట్టెమ్మ"తోపాటు యమగోల, మగమహారాజు, హీరో, నాకు పెళ్ళాం కావాలి, ఒక రాధ ఇద్దరు కృష్ణులు, స్వాతిముత్యం వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి.
About Writer
SELVI.M