ఐష్‌కే.. హాలీవుడ్ ఓటు..!
|
కానీ మూడు పదుల ప్రాయంలోనూ వన్నె తగ్గని అందచందాలతో ఇప్పటికీ యువ హీరోయిన్లకు ధీటుగా సవాలు విసురుతున్న ఐష్ అమెరికాకు చెందిన ఫోర్బ్స్ పత్రిక సర్వేలో ఖాన్‌లను వెనక్కి నెట్టి, అంతర్జాతీయ సినీ ఆకాశంలో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ సర్వేలో భారతదేశం నుంచి ఆరుగురు ఎంపిక కాగా, అందులో నటీమణిగా ఐష్ ఒక్కరే ఎంపిక కావడం విశేషం.
మేటి నటీనటుల ఆర్థిక పరిపుష్టిపై జరిగిన ఈ ఫోర్బ్స్ పత్రిక సర్వేలో.. ఐష్ 387వ స్థానంలో నిలిచారు. ఇక.. బాలీవుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్ 540వ స్థానంలోనూ, బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ 735వ స్థానంలోనూ, సల్మాన్ ఖాన్ 753వ స్థానంలో, ఇర్ఫాన్ ఖాన్ 825వ స్థానంలోనూ, హృతిక్ రోషన్ 1059 స్థానాలకు దిగజారారు.