1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"కర్ణుడు" కూడా పాండవుడేనట..!

వినోదం వెండితెర కథనాలు పంచపాండవులు ఆరుగురు పాండవులు ఆషాశైనీ శ్రీనివాసనాయుడు కర్ణుడు తెలంగాణ శకుంతల
WD
"పంచపాండవులు అంటారు. కానీ ఆరుగురు పాండవులేంటి..? అనే డౌట్ వస్తోంది..? కదా.. అదే మా సినిమా ట్విస్ట్." అంటున్నారు.. దర్శకుడు వై. శ్రీనివాసనాయుడు. యాగంటి క్రియేషన్స్ పతాకంపై జి. శివసుబ్రహ్మణ్యం, వై. శ్రీనివాసరావు సంయుక్తంగా "ఆరుగురు పాండవులు" అనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం సారథిలో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. కర్ణుడు కూడా పాండవుల కిందకే వస్తాడని, అందుకే "పాండవులు ఆరుగురు" అనే టైటిల్ పెట్టామని వివరించారు. అది ఎలా ఎందుకు? అనేదే తమ చిత్ర కథని ఆయన అన్నారు. హాస్యాత్మక చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి "వీళ్ళు బాగా రన్నింగ్ చేస్తారు" అనే ఉపశీర్షికను కూడా జోడించామని శ్రీనివాసనాయుడు అన్నారు.

ఓవర్‌నైట్‌లో కోట్లు సంపాదించాలని కలలుగనే పాండవుల కథ ఇదని, మరి వారి కల నెరవేరిందా? లేదా? అనేది చిత్రంలో చూడాల్సిందేనని ఆయన చెప్పారు. ఇందులో ఆషాశైనీ ప్రధాన పాత్ర పోషిస్తుందని దర్శకుడు వెల్లడించారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. కథ ఫన్నీగా ఉంటుందని, 45 రోజుల్లో చిత్రాన్ని పూర్తిచేస్తామని తెలిపారు. తాను పాండవుల్లో ఒకడిగా నటిస్తున్నానని, కథ బాగా నచ్చిందని చిత్రం శ్రీను చెప్పారు.

ఈ చిత్రంలో పలువురు హాస్యనటులతో పాటు రమాప్రభ, తెలంగాణ శకుంతల, రాగిణి, గీతాసింగ్ తదితరులు నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి కెమేరా.. సతీష్, మాటలు.. ధరణికోట శివరాంప్రసాద్, సంగీతం.. బొంబాయి బోలె, కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. వై.ఎస్. నాయుడు.
About Writer
SELVI.M