"మరో చరిత్ర"తో వస్తోన్న దిల్‌రాజు
|
మూడు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌లో ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో 365 రోజులు ఆడింది. హిందీలో సరిత పాత్రను రతి అగ్నిహోత్రి పోషించింది. ప్రస్తుతం ఇదే టైటిల్‌తో వస్తోన్న ఇదే చిత్రంలో... వరుణ్ సందేశ్, అనిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కెమేరామెన్ రాజుయాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ఈ చిత్రకథ చాలావరకు అమెరికాలో నడుస్తోందన్నారు. రెండో షెడ్యూల్ హైదరాబాద్, వైజాగ్‌లో జరుగుతుందని చెప్పారు. ఈ సినిమాను దర్శకుడు విజువల్‌గా రూపొందిస్తున్నారని , మిక్కీజెమేయర్ సంగీతం సమకూర్చారని దిల్‌రాజు అన్నారు.
ఇప్పటికే నాలుగు పాటలు రికార్డింగ్‌ను పూర్తి చేసుకున్నాయని, ఈ సినిమాను తమిళంలో కూడా తీస్తున్నామని, జెమినీ సర్క్యూట్ భాగస్వామ్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని దిల్‌రాజు వెల్లడించారు. పద్మవిభూషణ్ కమల్ హాసన్ చేసిన చిత్రాన్ని చేయడం అదృష్టంగా భావిస్తున్నామని ఆయన అన్నారు.