ఆన్లైన్ జీవోను రద్దు చేయండి: రామారావు
|
ఈ అభ్యంతరంపై వెంటనే ప్రభుత్వం స్పందించి జీవోను రద్దు చేసింది. మళ్లీ దాన్ని పునరావృతం చేయడం ఎంత మాత్రం సమంజసమని రామారావు ప్రశ్నించారు. ఈ నెల 25 ఛాంబర్ అత్యవసర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఆన్‌లైన్ విధానం అమలయితే ఒక్కో టిక్కెట్‌కు ఆరురూపాయలను అదనంగా గెలాక్సీ వసూలు చేస్తుందని రామారావు తెలిపారు. అదేవిధంగా వారం ముందే గెలాక్సీ సగం టిక్కెట్లు అమ్ముకోవచ్చునని, అమ్మగా వచ్చిన సొమ్ము ఎవరికి చెందుతుందో జీవో స్పష్టం చేయలేదని రామారావు తెలిపారు.
ఈ నిర్ణయంతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోందని రామారావు ఎత్తి చూపారు. పలు కార్యక్రమాల ద్వారా ఇండస్ట్రీ మేలు కోరిన రాష్ట్ర ప్రభుత్వం సానుభూతితో ఈ సమస్య కూడా పరిష్కరిస్తుందని ఆయన ఆశించారు.
మూడు ప్రముఖ టీవీ ఛానళ్ళపై ఇటీవల నిర్మాతల మండలి ప్రకటించిన నిషేధంపై రామారావు స్పందిస్తూ.. అది కేవలం సహాయ నిరాకరాణ మాత్రమేనని చెప్పారు. ప్రసారం కోసం కొన్ని ఛానల్స్ నిర్మాత దగ్గరకు వచ్చి చిత్రానికి సంబంధించిన క్లిప్పింగ్స్ తీసుకుంటాయి.
అలా టీవీ ఛానెల్స్ ప్రసారం చేయడం ద్వారా నిర్మాతకు పబ్లిసిటీ రావడంతో పాటు, ఛానెల్స్‌కు రేటింగ్ వస్తుందని ఇందులో నిర్మాత ఖర్చుచేసేదేమీ ఉండదని రామారావు వివరించారు. అందుకే చిన్న నిర్మాతలు గంటపాటు ఉచిత పబ్లిసిటీ అడిగారని, దానికి అందరూ అంగీకరించినా, మూడు ఛానెల్స్ అంగీకరించలేదని ఆయన అన్నారు.
12 ఏళ్లనాడే ఇలాంటిదే ఓ సమస్య ఉంటే ఛానెల్స్‌పై సహాయనిరాకరణ జరిగింది. దాన్ని నిషేధం అని తాను అనుకోవడం లేదని రామారావు స్పష్టం చేశారు. ఛానెల్స్‌పై ఉన్నట్లే ప్రింట్ మీడియాపై సహాయనిరాకరణ లేదని ఆయన తేల్చి చెప్పారు.