తమన్నా "ఆనంద తాండవం"..!

ఠాగూర్, అపరిచితుడు, దశావతారం నిర్మించిన ఆస్కార్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ రవిచంద్రన్, తాజాగా "ఆనంద తాండవం" అనే చిత్రాన్ని నిర్మించారు. ఇందులో తమన్నా ప్రధాన పాత్ర పోషించింది. సిద్ధార్థ అనే కొత్త యువకుడు ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్ర విశేషాలను రవిచంద్రన్ తెలియజేస్తూ.. అపరిచితుడు కథ అందించిన సుజాత రాసిన ఓ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందిందన్నారు. విదేశాల్లో స్థిరపడాలనుకున్న మోజులో కొట్టుమిట్టాడుతున్న యువతకు కనువిప్పు కలిగేలా చక్కని సందేశాత్మక చిత్రంగా తెరకెక్కించనున్నామన్నారు. శంకర్ శిష్యుడు గాంధీ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారని, ఎ.ఆర్. రెహమాన్ సోదరుడు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారని రవిచంద్రన్ తెలిపారు. త్వరలో ఈ సినిమా ఆడియో మార్కెట్లోకి విడుదల కానుందని, 90 రోజుల పాటు అమెరికాలో ఈ చిత్రాన్ని చిత్రించామని రవిచంద్రన్ అన్నారు. ఇంకా ఈ చిత్రానికి కెమేరా.. జీవాశంకర్, ఆర్ట్.. పద్మశ్రీ తోట ధరణి, మాటలు.. శశాంక్ వెన్నెలకంటి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. ఎ.ఆర్. గాంధీకృష్ణ. సంబంధిత సమాచారం కోసం శోధించండి.