1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"ఆ ఒక్కడు"గా వస్తోన్న అజయ్

వినోదం వెండితెర కథనాలు ఆ ఒక్కడు సురేష్ గోపి అజయ్ మధురిమ కాంబినేషన్ టాలీ టు హాలీ సుధాకర్ మూర్తి
సురేష్ గోపి, అజయ్, మధురిమ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రానికి "ఆ ఒక్కడు" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టాలీ టు హాలీ పతాకంపై సుధాకర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ.. ఈ చిత్రానికి "ఆ ఒక్కడు" టైటిల్ చక్కగా సరిపోతుందని, ఇప్పటికే 80శాతం టాకీ పూర్తయిందని చెప్పారు. పదిరోజుల్లో టాకీని పూర్తి చేసి, మార్చి 27 నుంచి క్లైమాక్స్ పూర్తి చేస్తామని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి నెలాఖరులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత వెల్లడించారు.

దర్శకుడు మాట్లాడుతూ.. చిన్న థ్రిల్లర్ పాయింట్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. ఓ సంఘటన చుట్టూ సాగే ఈ కథకు, మణిశర్మ ఆరు చక్కని బాణీలు సమకూర్చారని ఆయన తెలిపారు. ఇందులో రచనమౌర్య చేసే ఐటంసాంగ్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని చెప్పారు. అయితే సునీల్ పాత్ర ఇందులో సీరియస్‌ ఉన్నా కామెడీని పండిస్తుందని దర్శకుడు తెలిపారు.

ధర్మవరపు, ఎం.ఎస్. నారాయణ, మాస్టర్ భరత్‌పై కామెడీ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని, ప్రస్తుతం ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని మూర్తి వెల్లడించారు.
About Writer
SELVI.M