గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » చరిత్ర సృష్టించిన రెహ్మాన్: అవార్డుల పంట
కథనాలు
Feedback Print Bookmark and Share
 
FileFILE
భారత సంగీత ప్రపంచాన్ని తన సంగీత బాణీలతో ఉర్రూతలూగిస్తున్న ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. లాస్‌ఏంజెల్స్‌లో జరుగుతున్న 81వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రెహ్మాన్ మూడు నామినేషన్లకు గాను రెండు అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఇలా రెండు ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకున్న ఏకైక భారతీయుడుగా రెహ్మాన్ అంతర్జాతీయ యవనికపై త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు.

లాస్‌ఏంజిల్స్‌లోని కోడక్ థియేటర్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగుతోంది. ముంబైలోని మురికివాడ యువకుడి ఇతివృత్తంతో బ్రిటీష్ దర్శఖుడు డేనీ బోయల్ దర్శకత్వంలో రూపొందిన స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం ఇప్పటి వరకు ఆరు అవార్డులను కైవసం చేసుకుంది. ఇందులో రెండు రెహ్మాన్‌కు ఉన్నాయి. బెస్ట్ సాంగ్ కేటగిరీలో రెహ్మాన్‌తో కలిసి గుల్జర్‌ కూడా ఆస్కార్‌ను కైవసం చేసుకున్నారు.

ఈ చిత్రానికి బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బెస్ట్ సాంగ్, బెస్ట్ సౌండ్ మిక్సింగ్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ ప్లే, బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులు దక్కాయి. మిగిలిన చిత్రాలను పరిశీలిస్తే..
బెస్ట్ స్క్రీన్‌ప్లే : డస్టిన్‌ లాన్స్ బ్లాక్‌ (మిల్క్ చిత్రానికి)
ఉత్తమ సహాయనటి : ఫెనలోపీ క్రూజ్‌ ( వికీ క్రిస్టీనా బార్సీలోనా చిత్రం)
ఉత్తమ సహాయనటుడు : హీత్‌ లెడ్జర్‌ ( ది డార్‌‌క నైట్‌)
బెస్ట్ యానిమేటెడ్‌ ఫీచర్‌ : అండ్రూస్టాంటన్‌ (చిత్రం-వాల్‌ ఈ)
బెస్ట్ యానిమేటెడ్‌ షార్ట్ : లా మైనస్‌ ఎన్‌ పెటిట్‌‌సక్యూబ్స్
ఉత్తమ లఘు చిత్రం : టాయ్‌లాండ్‌
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : మైకేల్‌ ఒకానర్‌ ( చిత్రం-ది డచెస్‌)
మేకప్‌ : గ్రెగ్‌ కాసమ్‌ (ది క్యూరియస్‌ ఆఫ్‌ బెంజమిన్‌ బట్టన్‌).
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: భారత సంగీత ప్రపంచం సంగీత దర్శకుడు రెహ్మాన్ లాస్ ఏంజెల్స్ ఆస్కార్ అవార్డులు భారతీయుడు థియేటర్