గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » సంగీత్ సామ్రాట్ రెహ్మాన్‌కు భారత్ జయహో...
కథనాలు
Feedback Print Bookmark and Share
 
FileFILE
భారత సంగీత సామ్రాట్ రెహ్మాన్‌కు కోట్లాదిమంది భారతీయులు జయహో అంటున్నారు. అయితే తాను మాత్రం అమ్మ అశీస్సులతోనే ఇంతిటివాడినయ్యానంటూ ఆస్కార్ అవార్డు వేడుకల వేదికపై నుంచి వినమ్రయంగా చెప్పుకొచ్చారు. ఈ లోకంలో దైవానికి మంచిన గొప్పది లేదన్నారు. అయితే తాను అమ్మ ఆశీస్సులతోనే ఇంతవాడినయ్యానని భారతీయ సంగీత వైభవాన్ని విశ్వవ్యాప్తంగా ఎలుగెత్తి చాటిన సంగీత సామ్రాట్ ఏఆర్.రెహ్మాన్ అన్నారు.

91వ ఆస్కార్ వేడుకల ప్రదానోత్సవాల్లో వ్యక్తిగత విభాగంలో రెండు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడిగా రెహ్మాన్ చరిత్ర సృష్టించాడు. ఆస్కార్ అవార్డు వెల్లడి అనంతరం ఆయన వేదికపై నుంచి మాట్లాడుతూ, ప్రతి మనిషి జీవితంలో రెండు అవకాశాలు ఉంటాయన్నారు. వీటిలో ఒకటి ప్రేమ కాగా, మరొకటి ద్వేషమన్నారు.

ఇందులో తాను తొలి అంశాన్ని ఎంచుకుని ఈ స్థాయికి చేరుకున్నట్టు చెప్పారు. మా తుజే సలామ్ అంటూ.. తన సంగీతంలో ఓలలాడించిన సంగీత విధ్వాంసుడు రెహ్మన్‌కు భారత్ ఈ సందర్భంగా జయహో అంటూ కోట్లాదిమంది భారతీయులు నీరాజనాలు పలుకుతున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: భారత సంగీత సామ్రాట్ రెహ్మాన్ భారతీయులు జయహో ఆస్కార్ అవార్డులు పంట వినమ్రయంగా ఆశీస్సులు సంగీత