"యమలోకంలో శీనుగాడు"గా కృష్ణుడు
"వినాయకుడు" ఫేమ్ కృష్ణుడు కథానాయకుడిగా "యమలోకంలో శీనుగాడు" అనే చిత్రాన్ని రూపొందించనున్నట్లు నిర్మాత కె.వి.రావు వెల్లడించారు. ఈ చిత్రానికి కోడిరామకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారని నిర్మాత వెల్లడించారు.
సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతోన్న ఈ సివిమాలో దివంగత ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి తదితర నటీనటులు తెరపై కన్పించనున్నారని, ఇందుకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్‌ను "మమ్మీ" చిత్రానికి పనిచేసిన తెలుగుతేజం చేయనుందని కె.వి.రావు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. తాను "కావ్యాస్ డైరీ" చిత్రాన్ని మార్చి మూడవ వారంలో ఓవర్‌సీస్‌లో విడుదల చేయనున్నామని నిర్మాత కె.వి.రావు తెలిపారు. ఈయన గతంలో కువైట్ డిస్ట్రిబ్యూటర్‌గా దాదర్ ఎక్స్ప్రెస్, అన్వేషణ, సర్కారు వంటి చిత్రాలను రిలీజ్ చేశారు. ప్రస్తుతం "కావ్యాస్ డైరీ"ని యు.ఎస్, యు.కె., సింగపూర్, ఆస్ట్రేలియా, కువైట్‌లలో విడుదల చేయనున్నట్లు కె.వి.రావు వెల్లడించారు. ఈ చిత్రం ప్రీమియర్ షోను న్యూజెర్సీ, కాలిఫోర్నియాలో వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.