సంగీత మాంత్రికుడికి ఘన స్వాగతం
"స్లమ్డాగ్ మిలియనీర్" చిత్రానికి సంగీతం సమకూర్చి, ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న భారత సంగీత సముద్రం ఎ.ఆర్. రెహ్మాన్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ ప్రజల మన్ననలు అందుకుంటున్న రెహ్మాన్, "స్లమ్‌డాగ్" చిత్ర సంగీత విభాగానికి ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
ఇదే చిత్రానికి బ్రిటన్, బాప్టా అవార్డులను కైవసం చేసుకున్న రెహ్మాన్, భారతావనిలో అడుగెట్టారు. చెన్నై విమానాశ్రయంలో ఆస్కార్ అవార్డులతో దిగిన రెహ్మాన్‌కు ఒకవైపు అభిమానులు, మరోవైపు సంగీత కళాకారులు వినూత్నంగా స్వాగతం పలికారు. అభిమానులు పెద్ద ఎత్తున పుష్పగుచ్చాలతో స్వాగతం పలకగా, డ్రమ్స్ శివమణి తన డ్రమ్స్ మ్యూజిక్‌తో రెహ్మాన్‌కు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రెహ్మాన్ మాట్లాడుతూ.. తన మ్యూజిక్ కెరీర్ ఈ అవార్డుతో ముగిసిపోలేదని, ఈ అవార్డు తన సంగీత కెరీర్‌కు ఆరంభం మాత్రమేనని చెప్పారు.
ఇదేవిధంగా.. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి సౌండ్ ఎడిటింగ్ విభాగంలో ఆస్కార్ అందుకున్న సౌండ్ ఇంజనీర్ రసూల్ పొకుట్టి కూడా స్వదేశం చేరుకున్నారు. ముంబై చేరుకున్న ఆయనకు అభిమానులు, ప్రముఖ నటులు ఘన స్వాగతం పలికారు.