యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో "కరెంట్"
|
తాజాగా టాకీని పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించుకుంటోంది. ఈ సందర్భంగా ఫైట్‌మాస్టర్ కనల్‌కణ్ణన్ మాట్లాడుతూ.. సుశాంత్ ఫైట్స్ అదిరాయని, రిస్కీ షాట్స్ సైతం డూప్ లేకుండా రియల్‌గా చేస్తున్నాడని చెప్పారు. "కరెంట్" లవ్‌స్టోరీ అయినప్పటికీ యాక్షన్ పార్ట్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సుశాంత్‌కు హీరోగా మంచి కెరీర్ ఉందని, కచ్చితంగా "కరెంట్" సినిమా పెద్ద హిట్ అవుతుందన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. ఫైట్స్ సన్నివేశాల చిత్రీకరణకు అనంతరం, భారీ ఎత్తున పాటలను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. దేవీశ్రీప్రసాద్ సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారని, ఈ సమ్మర్‌కి యూత్‌ని "కరెంట్" ఆకట్టుకుంటుందని వెల్లడించారు. మంచి లవ్ ఫీల్ ఉన్న సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రం సుశాంత్ కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందన్నారు.
బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సునీల్, షఫీ, రఘుబాబు, చరణ్ రాజ్, సుధ, ఝాన్సీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్.. నారాయణ రెడ్డి, ఎడిటింగ్.. మార్తాండ్ కె. వెంకటేష్.