1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

షాక్ దర్శకుడితో "ఎన్టీఆర్"..!

వినోదం వెండితెర కథనాలు షాక్ దర్శకుడు హరీష్ శంకర్ ఎన్టీఆర్ బుజ్జి వెంకటేష్ గోపిచంద్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం
రవితేజ హీరోగా రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన "షాక్" చిత్ర దర్శకుడు హరీష్ శంకర్‌ చిత్రంలో యువ హీరో ఎన్టీఆర్ నటించనున్నారు. "కొంచెం ఇష్టం కొంచెం కష్టం" నిర్మాత నల్లమలుపు బుజ్జి ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ఈ ఏడాది తాను మూడు చిత్రాలను నిర్మించనున్నట్లు శనివారం బుజ్జి వెల్లడించారు.

సిద్ధార్థ, తమన్నా కాంబినేషన్‌లో డాలీ దర్శకత్వంలో రూపొందిన "కొంచెం ఇష్టం కొంచెం కష్టం" సినిమా త్వరలో 70 సెంటర్లలో 50 రోజులు పూర్తిచేసుకోనుందని బుజ్జి అన్నారు. తన బేనర్‌కు ఈ సినిమా మంచి పేరు సంపాదించిందని, తాజాగా ఎన్టీఆర్ హీరోగా మేలో కొత్త చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నామని బుజ్జి తెలిపారు.

ఎన్టీఆర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభమవుతుందని, ఆ తర్వాత అగ్రహీరో వెంకటేష్ హీరోగా నూతన దర్శకుడితో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నానని వెల్లడించారు. వెంకీ సినిమా తర్వాత గోపిచంద్ హీరోగా, దర్శకుడు డాలీతో మూడో చిత్రాన్ని నిర్మించనున్నానని బుజ్జి పేర్కొన్నారు.
About Writer
SELVI.M