1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

వెరోనికాను పెళ్లాడిన విష్ణువర్ధన్

వినోదం వెండితెర కథనాలు ఢీ కృష్ణార్జున టాలీవుడ్ హిట్ హీరో విష్ణువర్ధన్ బాబు వెరోనికా పెళ్ళి మోహన్ బాబు వైఎస్సార్ చంద్రబాబు అక్కినేని
"ఢీ", "కృష్ణార్జున" సినిమాల ద్వారా టాలీవుడ్ హిట్ హీరోగా ముద్రవేసుకున్న మంచు విష్ణువర్ధన్ బాబు, వెరోనికాల వివాహం వైభవంగా జరిగింది. ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమారుడైన విష్ణువర్ధన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్ సోదరుడు సుధాకర్ రెడ్డి కుమార్తె వెరోనికాను ఆదివారం ఉదయం పెళ్ళాడాడు.

హైదరాబాద్ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ కళ్యాణ వేడుకకు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, వెంకటేష్, ఈనాడు ఛైర్మన్ రామోజీ రావు, దేవీశ్రీ ప్రసాద్, సత్యనారాయణ, బాలకృష్ణ వంటి పలువురు అతిరథ మహారథులు, సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఇందులో భాగంగా... విష్ణువర్ధన్ పెళ్ళి వేడుకలో.. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు, నేతలతో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, విపక్ష నేతలు కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
About Writer
SELVI.M