1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

వైభవంగా శివబాలాజీ-మధుమిత వివాహం

వినోదం వెండితెర కథనాలు వైభవం శివబాలాజీ మధుమిత వివాహం రామారావు మురళీమోహన్
చందమామ ఫేమ్ శివబాలాజీ, మధుమితల వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. హైదరాబాదులో జరిగిన ఈ వివాహానికి రామారావు, మురళీమోహన్ వంటి పలువురు సినిమా ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. "ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన శివబాలాజీ, "ఆర్య", ఎలా చెప్పను, సంక్రాంతి, చందమామ, అన్నవరం వంటి సినిమాల్లో నటించాడు.

తమిళ హీరోయిన్ అయిన మధుమితకు "కుడైక్కుల్ మళై" సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది. తమిళంలో "ఇంగ్లీష్ క్కారన్" అనే చిత్రంలో శివబాలాజీ, మధుమితలు కలిసి నటించారు.

ఈ సినిమా ద్వారా వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అనంతరం పెద్దల అంగీకారంతో గత ఏడాది ఆగస్టు నెలలో శివబాలాజీ- మధుమితల నిశ్చితార్థం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
About Writer
SELVI.M