"సరే నీ ఇష్టం" లోగో ఆవిష్కరణ
|
ఈ చిత్రం నాలుగురోజుల ప్యాచ్‌వర్క్ మినహా షూటింగ్ పూర్తిచేసుకుందని, చక్కి చక్కని సంగీతం సమకూర్చారని దర్శక నిర్మాత మహేష్ చంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళితో పాటు పలువురు దర్శకులు చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
చిత్ర కథ గురించి దర్శకుడు చెబుతూ.. "మానవతా విలువలు గల చిత్రమిదన్నారు. పిల్లల్ని పిల్లల్లా ఎదగనివ్వాలి.. పక్కవాడు ఆటల్లో మెరుగైతే.. మనవాడిని అలా అవ్వాలని బాధించకూడదు. ఈ దేశంలో అందరూ వైవిధ్యంగా ఉంటారు. ఒక తోటలో అన్నీ ఒకరకమైన చెట్లుండవు. అలా ఉంటే అది అందంగా ఉండదు. జీవితంలో ప్రతి వ్యక్తికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. దాన్ని తల్లిదండ్రులు ఎత్తిచూపి వారిని ప్రోత్సహించాలి" ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం రూపొందుతోందని అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో షిండే, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, బాబూ మోహన్, అన్నపూర్ణ తదితరులు నటించారు. కెమేరా.. ఎ. విజయ్ కుమార్, ఎడిటింగ్.. గౌతంరాజు, నిర్మాతలు.. మహేష్ చంద్ర, రమేష్ రెడ్డి, సోమారెడ్డి, జీవితరెడ్డి, విజయ్.