18 నుంచి ప్రభాస్-పూరి కొత్త చిత్రం
|
కథలో సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్, రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ ఉన్నాయి. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కి తగినట్టుగా ఈ చిత్రం ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఈ చిత్రం డిఫినెట్‌గా ఓ బ్లాక్ బస్టర్ అవుతుంది. గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించిన పూరీ.. ఈ చిత్రాన్ని మరో హీట్ చేయడానికి సిద్ధమయ్యారని చెప్పారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటించనుంది. మిగిలిన పాత్రలకు త్వరలోనే ఇతర తారాగణాన్ని ఎంపిక చేస్తామని ఆదిత్యరామ్ వెల్లడించారు.
చిత్ర సమర్పకులు, దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ప్రభాస్‌తో చేస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇది. ప్రభాస్ క్యారెక్టర్ మాస్‌గా ఉంటూనే డిఫరెంట్ స్టైల్‌లో సాగుతుంది. నా సమర్పణలో ఆదిత్యరామ్ నిర్మాతగా చేస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.
"సందడే సందడి", "ఖుషి ఖుషీగా" "స్వాగతం", వంటి హిట్ చిత్రాల తర్వాత ఆదిత్యరామ్ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం-4గా రూపొందుతున్న ఈ భారీ చిత్రానికి సమర్పణ పూరి జగన్నాథ్, నిర్మాత ఆదిత్యారామ్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం పూరీ జగన్నాథ్.