1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

త్వరలో పెళ్లి కూతురు కాబోతున్న "మంజీర"

వినోదం వెండితెర కథనాలు పెళ్లి కూతురు మంజీర రుక్మిణి ఈశ్వర్ మంజీర టాలీవుడ్ మంజుల విజయ్ కుమార్
రుక్మిణి, ఈశ్వర్, మంజీర వంటి చిత్రాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన వర్ధమాన నటి శ్రీదేవి త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. ప్రముఖ తమిళ నటుడు విజయ్ కుమార్, నటి మంజుల దంపతుల చిన్న కుమార్తె అయిన శ్రీదేవికి ఈ నెల 15వ తేదీన నిశ్చితార్థం వైభవంగా జరుగనుందని ఆమె తండ్రి విజయ్ కుమార్ వెల్లడించారు.

హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ అధినేత రాహుల్‌తో శ్రీదేవి వివాహం జరుగుతుందని విజయ్ కుమార్ అన్నారు. రుక్మిణి చిత్రంలో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన శ్రీదేవి తాజాగా మంజీర చిత్రం ద్వారా ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంది. తెలుగు చిత్రాల్లో మాత్రమే కాకుండా కోలీవుడ్‌లో అందాల రాశిగా ముద్రవేసుకున్న శ్రీదేవి మలయాళ చిత్రాల్లోనూ నటించింది.
About Writer
SELVI.M