1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

13న "ఆనందతాండవం" ఆడియో రిలీజ్

వినోదం వెండితెర కథనాలు ఆనందతాండవం ఆడియో రిలీజ్ స్కార్ ఫిలింస్ పతాకం ఎస్విఆర్ తమన్నా సిద్ధార్థ రుక్మిణి
తమన్నా ప్రధాన పాత్రలో ఆస్కార్ ఫిలింస్ పతాకంపై అగ్రనిర్మాత వి. రవిచంద్రన్ నిర్మిస్తున్న చిత్రం "ఆనందతాండవం". ఈ సినిమా ట్రైలర్స్‌కు రాష్ట్రంలోని అన్ని కేంద్రాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని సహనిర్మాత డి.సురేష్ అన్నారు. వరుసగా బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్స్ ఇస్తోన్న ఆస్కార్ ఫిలింస్ బేనర్ పతాకంపై వస్తోన్న ఈ చిత్రం కూడా మ్యూజికల్ హిట్ అవుతుందని సురేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సూపర్ హిట్ ఆడియోను సోని బిఎంజి ద్వారా ఈ నెల 13న విడుదల చేస్తున్నామని, "ఆనందతాండవం" చిత్రాన్ని ఎస్.వి.ఆర్. మీడియా సంస్థ అధినేత్రి శోభారాణి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారని సహనిర్మాత వెల్లడించారు.

మార్చి చివరివారంలో విడుదలయ్యే ఈ చిత్రంలో తమన్నా, సిద్ధార్థ, రుక్మిణి ప్రధాన పాత్రలు పోషించారు. ఇంకా ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ.. జీవాశంకర్, ఆర్ట్.. పద్మశ్రీ తోట తరణి, సంగీతం.. జి.వి. ప్రకాశ్ కుమార్, కథ, సుజాత, మాటలు.. శశాంక్ వెన్నెల కంటి, డాన్స్.. రఘురామ్, శోభి, నోబెల్, విజి, పాటలు.. సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర, వనమాలి, ఎడిటింగ్.. వి.టి. విజయన్. నిర్మాత.. ఆస్కార్ ఫిలింస్ వి. రవిచంద్రన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. ఎ.ఆర్. గాంధీ కృష్ణ.
About Writer
SELVI.M