1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఆంధ్రప్రదేశ్ అంటే నాకెంతో ఇష్టం: రెహ్మాన్

వినోదం వెండితెర కథనాలు ఆంధ్రప్రదేశ్ ఇష్టం రెహ్మాన్ స్లమ్డాగ్ మిలియనీర్ ఆస్కార్ అవార్డులు నెల్లూరు కసుమూరు దర్గా
ఆంధ్రప్రదేశ్ అంటే తనకెంతో ఇష్టమని సంగీత మాంత్రికుడు ఎ.ఆర్. రెహ్మాన్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన "స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రానికి సంగీతం సమకూర్చి రెండు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న ఎ.ఆర్. రెహ్మాన్ బుధవారం నెల్లూరు జిల్లాలోని కసుమూరు మస్తాన్ వలీ దర్గాను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కసుమూరు దర్గా సర్వమత సమ్మేళనమని, ఆస్కార్ అవార్డు తనకు లభించడంలో తన గొప్పతనమేమీ లేదని, భారతీయుల ఆశీస్సులే ఇందుకు కారణమని రెహ్మాన్ అన్నారు.

ఆస్కార్ అవార్డును దక్కించుకున్న తర్వాత తొలుత కడప దర్గాను సందర్శించిన రెహ్మాన్, బుధవారం తన తల్లితో పాటు కసుమూరు దర్గాను సందర్శించి, ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
About Writer
SELVI.M