రామ్మూర్తి కుమారుడు హీరోగా కొత్త చిత్రం
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కుమారుడు రోహిత్‌ను కథానాయకుడిగా పరిచయం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని పార్టీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. సినిమా బాధ్యతను సి. అశ్వనీదత్‌కు చంద్రబాబు అప్పగించారు.
ఇప్పటికే పలువురు హీరోల కుమారులతో చిత్రాలు నిర్మించిన అశ్వనీదత్ మరోమాట మాట్లాడకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఎన్నికల వేడి ఉన్నా సినిమా నిర్మాణ పనులను అశ్వనీదత్ తన కుమార్తెకు అప్పగించారు.
ఈ చిత్రానికి దర్శకుడిగా చైతన్యను ఎంపిక చేశారు. ప్రస్తుతం చైతన్య హ్యాపీడేస్ ఫేమ్ నిఖిల్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఒకవైపు కథ రెడీ అవుతుంటే.. మరోవైపు రోహిత్‌కు నటనలో శిక్షణ ఇప్పించే పనిలో ఉన్నారు. చంద్రగిరి నియోజకవర్హంలో రామ్మూర్తినాయుడు పోటీచేయాల్సి ఉండగా, ఆ సీటును నటి రోజాకు అప్పగించారు.