1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఆత్మహత్యలొద్దంటున్న భరణి "కీ"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు ఆత్మహత్యలు జయలలిత భరణి కీ సిరా షఫి
WD
గతంలో "సిరా" సినిమాకు దర్శకత్వం వహించి అవార్డులు అందుకున్న తనికెళ్ళభరణి తాజాగా "కీ" అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దనే నినాదంతో ఈ చిత్రం చిత్రించబడింది. ఈ చిత్రానికి నటి జయలలిత నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.

చిత్రం గురించి భరణి తెలుపుతూ.. చాలామంది జీవితంలో ఏది సాధించలేక, ప్రేమ విఫలం, పరీక్షల్లో ఫెయిల్.. ఇలా రకరకాలుగా మానసిక దౌర్భల్యానికి గురవుతూ ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటారు. అలాంటి ఆలోచనలు రాకుండా మన మెదడులోనే ఓ కీ ఉంటుంది. దాన్ని మనం గుర్తించే ప్రయత్నం చేయాలి. అదే ఈ లఘు చిత్రమని చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ఉత్సవాలకు పంపామని, ఫలితాలు ఇంకా రావాల్సి ఉన్నాయని అన్నారు.

నటుడు షఫి మాట్లాడుతూ.. "సిరా" చిత్రం తర్వాత భరణి ఓ సినిమా చేద్దామన్నారు. నటుడిగా మట్టి ముద్దలాంటి వాడిగా ఆయన చేతుల్లో ఒదిగిపోయానని వెల్లడించారు. ఇటువంటి చిత్రాలు చూసి మానసిక ధైర్యాన్ని పెంపొందింపజేసుకుంటారని ఆశిస్తున్నట్లు షఫి అన్నారు.

జయలలిత వ్యాఖ్యానిస్తూ.. నిర్మాతగా ఈ చిత్రం ద్వారా తొలి అడుగు వేస్తున్నానని, నటిగా ఎన్ని చేశాననే విషయం పక్కన పెడితే.. "కీ" ద్వారా మంచి సినిమా తీశాననే సంతృప్తి కలిగిందన్నారు. మనసాక్షికోసం ఈ చిత్రాన్ని తీశానని, కొన్ని బతుకు దీపాలను వెలిగించాలనే ఆశయంతో ఈ చిత్రాన్ని నిర్మించానని చెప్పారు. త్వరలో ఈ చిత్రాన్ని పలు థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు భరణి తెలియజేశారు.
About Writer
SELVI.M