గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » చివరి షెడ్యూల్‌లో "కలవరమాయే మదిలో"
కథనాలు
Feedback Print Bookmark and Share
 
FILE
"ఆవకాయ్ బిర్యాని" ఫేమ్ కమల్ కామరాజు హీరోగా, అష్టాచమ్మా ఫేమ్ కలర్స్ స్వాతి హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "కలవరమాయే మదిలో". మోహన్ మీడియా క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మోహన్ వడ్లపట్ల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోందని దర్శకుడు వెల్లడించారు.

ఏప్రిల్ రెండో తేదీ లోపు సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలన్ని పూర్తవుతాయని దర్శకుడు తెలిపారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే 15వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని సతీష్ అన్నారు. ఇంకా ఈ చిత్రంలో విక్రమ్ గోఖలే, తనికెళ్ళ భరణి, జయసుధ తదితరులు నటిస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర కథనాలు చివరి షెడ్యూల్ కలవరమాయే మదిలో కమల్ కామరాజు కలర్స్ స్వాతి