"సమర్థుడు" ఆడియో ఆవిష్కరణ
|
ఆడియో సీడీని రెబల్ స్టార్ కృష్ణంరాజు విడుదల చేసి దర్శకుడు బి. గోపాల్‌కు అందజేశారు. ఆడియో క్యాసెట్‌ను వెంకట్రామిరెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ. ఈ చిత్ర కథను తనకు మాటలతో సహా చెప్పారన్నారు. ఆ సమయంలో తన సతీమణి పక్కనే ఉందని, ఈ కథ బాగుందని, తప్పకుండా చేయండని చెప్పడంతో ఈ సినిమా చేశానని వెల్లడించారు. సంగీతం బాగా నచ్చిందని, సంగీతంతో పాటు సినిమా కూడా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని కృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. రాజా, సంజన మాట్లాడుతూ.. ఈ చిత్రం తమకు మంచి పేరు తెస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.ఎ. సాయన్న, ఎపిపిఎస్‌సి ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, సంగీత దర్శకుడు వల్లూరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.