అర్జున్-సాయికుమార్‌ల "జై సాంబశివ"
|
ఈ చిత్రం గురించి నిర్మాతలు చెబుతూ.. కొడుకు దుడుకుతనానికి కళ్ళెం వేయాలని అర్జున్‌ను గుడిపూజారి సలహా మేరకు ఓ శైవక్షేత్రం తీసుకువెళుతుంది. అయితే అక్కడేమి జరిగింది? ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగింది? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుందన్నారు.
ఈ చిత్రంలో ఆరు పాటలు, ఏడు ఫైట్లు ఉన్నాయని, ముఖ్యంగా అర్జున్, సాయికుమార్‌లపై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం డీటీఎస్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి నెలాఖరుకల్లా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు.
సుధ, కరుణాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు.. ఘంటసాల రత్నకుమార్, పాటలు.. భువనచంద్ర, సాహితీ, సంగీతం.. శ్రీకాంత్ దేవా, సహనిర్మాత.. పి. చంద్రశేఖర్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. పేరరసు.