1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"సమ్మక్క-సారక్క" అభినందన సభ

వినోదం వెండితెర కథనాలు సమ్మక్క సారక్క మహాత్మ్యం శతదినోత్సవం అభినందన సభ బాబూమోహన్ ఉదయ్ బాబు ప్రేమ
WD
బాబూమోహన్ తనయుడు ఉదయ్‌బాబు కథానాయకుడిగా, ప్రేమ టైటిల్ పాత్ర పోషించిన శ్రీ మేడారం "సమ్మక్క-సారక్క మహాత్మ్యం" చిత్రం శతదినోత్సవ అభినందన సభ సోమవారంనాడు జరిగింది.

ఈ నెల 3వ తేదీతో ఈ చిత్రం వందరోజులు పూర్తి చేసుకుందని చిత్ర నిర్మాణ సారధి బాబూమోహన్ అన్నారు. తెలంగాణాలో విడుదలైన అన్ని థియేటర్లలో చిత్రానికి మంచి స్పందన దక్కిందన్నారు. ఇటువంటి చిత్రాలకు ప్రమోషన్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని బాబూమోహన్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో రేలంగి నరసింహారావు, ఎస్.వి.కృష్ణారెడ్డి, కాశీ విశ్వనాథ్, చంద్రమహేష్, రాంప్రసాద్, ప్రభాకర్, అలహరి తదితరులు మాట్లాడుతూ.. ఉదయ్ బాబు తొలిసారిగా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో, అతని ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. మాస్ హీరోగా ఉదయ్ బాబు ఎదిగే లక్షణాలు కన్పిస్తున్నాయని పేర్కొన్నారు.

చిత్ర నిర్మాత ఇందిరా విజయలక్ష్మి మాట్లాడుతూ.. రొటీన్ చిత్రాలకు విరుద్ధంగా భక్తి ప్రదాన చిత్రాన్ని నిర్మించి సక్సెస్ సాధించామని వెల్లడించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వేమగిరి మాట్లాడుతూ.. తాను దర్శకత్వం వహించిన గంగ వంటి సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయని, ఈ చిత్రం కూడా విజయవంతం కావడం ఆనందంగా ఉందని చెప్పారు.
About Writer
SELVI.M