1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ముమైత్ "స్నేక్ డ్యాన్స్" సూపర్..!

వినోదం వెండితెర కథనాలు ముమైత్ ఖాన్ పున్నమినాగు స్నేక్ డాన్స్ సూపర్ కోదండరామిరెడ్డి చిరంజీవి యండమూరి వీరేంద్రనాథ్
WD
టాలీవుడ్ సెక్సీభామ ముమైత్ ఖాన్ టైటిల్ పాత్ర పోషించిన తాజా చిత్రం "పున్నమినాగు". ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి నేతృత్వంలో, విజయ్ కుమార్ గౌడ్, జి. మహేశ్వరి రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ పున్నమినాగు లోకకళ్యాణానికి ఏమి చేసిందనేదే పాయింట్‌ అని, ఇందులో ముమైత్ ఖాన్ వేసిన స్నేక్‌డాన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.

ఈ చిత్రం ఆడియో వేడుక మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఎస్.ఎ. రాజ్ కుమార్ సమకూర్చిన సంగీతం అద్భుతంగా ఉందని దర్శక, నిర్మాతలు ఈ కార్యక్రమంలో కొనియాడారు.

ఈ సందర్భంగా.. ఎస్.ఎ. రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. మెలోడీ సంగీతాన్ని మాత్రమే అందించే తనకు ఈ చిత్రం చేయమని చెప్పినప్పుడే కొద్దిగా తడబడ్డానని అన్నారు.

కోదండరామిరెడ్డి, యుండమూరి వీరేంద్రనాథ్ వంటి ప్రముఖులు కలిసి పనిచేస్తున్న చిత్రమంటేనే ఏదో ప్రత్యేకత ఉంటుందని భావించి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చేందుకు అంగీకరించానని రాజ్‌కుమార్ చెప్పారు.

దర్శకుడు మాట్లాడుతూ.. ఈ టైటిల్ వినగానే గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమానే గుర్తుకు వస్తుందని, చాలా కాలం తర్వాత పాము కథాంశంతో "పున్నమినాగు"ను తెరకెక్కించనున్నామని తెలిపారు.

ఈ సినిమా కోసం ఎన్నో కథలు పరిశీలించి యండమూరి రాసిన కథను ఎంచుకుని ఫైనల్ చేశామని కోదండరామిరెడ్డి వివరించారు. చక్కని పాయింట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

యండమూరి మాట్లాడుతూ.. ప్రపంచ వినాశనాన్ని కాపాడిన నాగుపాము కథే ఈ చిత్రమని చెప్పారు. ఈ చిత్రానికి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, ఒకటి రెండు చిత్రాలు సక్సెస్ తోనే ఇప్పటి దర్శకులు అందుబాటులో ఉండరని, అలాంటిది నూరు చిత్రాలకు దర్శకత్వం వహించిన కోదండరామిరెడ్డిలో ఉన్న సౌమ్యం తనకెంతో నచ్చిందని రచయిత వెలిగొండ శ్రీనివాస్ అన్నారు.

ఇంకా ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో రాజకీయ నాయకులు ఎస్.వి. సుబ్బారెడ్డి, భూమానాగిరెడ్డి, సినిమా రంగ ప్రతినిధులు బెల్లంకొండ సురేష్, సి. కళ్యాణ్, ముమైత్ సోదరి సజన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
About Writer
SELVI.M