మానవత్వం గొప్పదనే "శ్రీ షిర్డి సాయిబాబా"
|
ఏలూరు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో.. అనుకున్న విధంగా, అందరి సహకారంతో సినిమాను పూర్తి చేశామని బి.వి.రెడ్డి అన్నారు. బాబా మహిమలు కథతో కొమ్మనాపల్లి గణపతిరావు అద్భుతమైన కథను అందించారని, ఈ నెలలోనే ఆడియోను, వచ్చే నెలలో సినిమాను విడుదల చేయనున్నామని బి.వి.రెడ్డి వెల్లడించారు.
గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత గల ఈ చిత్రంలో ఏడు పాటలున్నాయని దర్శకుడు రామకృష్ణ చెప్పారు. ఒక్కసారి బాబా చరిత్రను గుర్తుచేసే చిత్రమిదని ఆయన తెలిపారు. మతంకన్నా మానవత్వం గొప్పదనే పాయింట్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుందని గణపతిరావు వివరించారు.
సుమన్, నాగబాబు, శివకృష్ణ, నారాయణ శాస్త్రి, రమాప్రభ, శివపార్వతి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా.. కె. శ్రీనివాసరెడ్డి, సంగీతం.. లలిత్ సురేష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. జి. రామకృష్ణ.