1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ప్రియాంకాకు పురస్కారం

వెండితెర కథనాలు హీరోయిన్ మాజీ మిస్ వరల్డ్ ప్రియాంకా చోప్రా ప్రతిభ హాలీవుడ్ 33వ హాంగ్కాంగ్ అంతర్జాతీయ ఫిల్మోత్సవం
ప్రముఖ హీరోయిన్, మాజీ మిస్ వరల్డ్ ప్రియాంకా చోప్రా చూపిన ప్రతిభకు గుర్తుగా ఆమెకు నెల్సన్ బాక్సాఫీస్ పురస్కారంతో సన్మానించనున్నారు. మార్చి నెల 23వ తేదీన మూడవ అసియా ఫిల్మ్ పురస్కార వితరణ మహోత్సవంలో హాలీవుడ్ రిపోర్టర్ తరపున ఈ పురస్కారాన్ని ఇవ్వనున్నారు.

హాంగ్‌కాంగ్‌లో 33వ హాంగ్‌కాంగ్ అంతర్జాతీయ ఫిల్మోత్సవంలో భాగంగా జరిగే ఈ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆమెకు ప్రదానం చేయనున్నారు. ప్రియాంక చోప్రా 2002వ సంవత్సరంలో "అందాజ్" సినిమాతో అరంగ్రేటం చేశారు.

"యేతరాజ్" సినిమాలో ఆమె యాంటీ హీరోయిన్(విలనీ) పాత్రను పోషించి తన సత్తాను చాటుకున్నారు. దీనికిగాను 2004వ సంవత్సరంలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ మహిళా విలనీగా పురస్కారాన్ని గెలుచుకున్నారు.

నిరుడు ఆమె నటించిన ఆరు చిత్రాలు బాక్సాఫీసువద్ద హిట్లను నమోదు చేసుకున్నాయి. అందులో "దోస్తానా", "ఫ్యాషన్" ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బాలీవుడ్‌లో నంబర్ వన్ స్థానాన్ని పదిలపరచుకోవడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సినిమా వర్గాలు తెలుపుతున్నాయి.
About Writer
Gulzar Ghouse