1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

కలర్స్ స్వాతి కథానాయికగా "అనంతపురం-1980"

వినోదం వెండితెర కథనాలు కలర్స్ స్వాతి కథానాయిక అనంతపురం1980 శశికుమార్ అష్టాచమ్మా సింహపురి
WD
కష్టాలలో రిలీజైన కొన్ని చిత్రాలు.. ఆ తర్వాత ఘనవిజయం సాధిస్తాయి. ఇదే తరహాలో "అనంతపురం-1980" అనే సినిమా మొదట "సుబ్రహ్మణ్యపురం" పేరుతో తమిళంలో, చిన్న సినిమాగా విడుదలైనా.. అద్భుత విజయం సాధించింది. అంతా కొత్తవారితో రూపుదిద్దుకున్న ఈ సినిమా కథను పట్టుకుని శశికుమార్ (చిత్ర దర్శకుడు) డేట్స్ కోసం చిన్నా పెద్దా తేడా లేకుండా అనేకమంది హీరోల వద్దకు తిరిగారు.

కానీ ఎవరూ ఈ సినిమా చేయడానికి ఇష్టపడలేదు. దాంతో తానే హీరోగా చేసి ఘనవిజయం సాధించారు. అటువంటి ఈ చిత్రాన్ని సింహపురి పతాకంపై "అనంతపురం -1980" పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నామని చిత్ర సమర్పకుడు నరేంద్ర చెబుతున్నారు.

ఈ సినిమా గురించి నరేంద్ర ఇంకా చెబుతూ.. ఇది ఫ్యాక్షన్ సినిమా కాదు గానీ, కొంతవరకు అనంతపురం వాతావరణాన్ని పోలి ఉంటుందని చెప్పారు. యూత్‌కు సందేశమిచ్చే చిత్రమిదని, ఐదుగురు యువకులు రాజకీయ నాయకుల ఎత్తు పై ఎత్తులకు ఎలా బలైపోయారనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని చెప్పారు.

హీరో ప్రేమ పేరుతో ఎలా మోసపోయాడన్నది కూడా ఈ సినిమాలో ఉంటుందని, తొలి అర్థభాగం అంతా కామెడీగా సరదాగా సాగుతుందని, సెకండాప్ అంతా మాసీగా ఉండి ఉత్కంఠను నరేంద్ర కలిగిస్తుందన్నారు. ఈ చిత్రం మలయాళంలో కూడా విజయవంతమైందని, తెలుగులో తప్పకుండా హిట్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇకపోతే.. "అష్టాచమ్మా" ఫేమ్ కలర్స్ స్వాతి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు.. శశాంక్ వెన్నెలకంటి, సంగీతం.. జేమ్స్ వసంతన్, నిర్మాత.. ఎం. రంగనాథ్.
About Writer
SELVI.M