1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ముమైత్ ఖాన్ "టార్గెట్" ఆడియో విడుదల

వినోదం వెండితెర కథనాలు ముమైత్ ఖాన్ టార్గెట్ ఆడియో విడుదల శివబాలాజీ శ్రద్ధాదాస్ రమేష్ రాజా
WD
ముమైత్‌ఖాన్ ప్రధాన పాత్రలో శివబాలాజీ, శ్రద్ధాదాస్ జంటగా నటిస్తోన్న చిత్రం "టార్గెట్". రమేష్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఫిలింఛాంబర్‌లో జరిగింది. ముఖ్యఅతిథి సి. కళ్యాణ్ ఆడియో సీడీని విడుదల చేసి తొలి ప్రతిని సంగీత దర్శకుడు కోటికి అందించారు.

ఆడియో విడుదల సందర్భంగా కోటి మాట్లాడుతూ.. ఈ చిత్ర కథ విన్నప్పుడు మంచి విజయం సాధిస్తుందని భావించానని, ముమైత్, శివబాలాజీల నటన ఈ సినిమా హైలైట్‌గా నిలుస్తుందన్నారు.

ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్ర యూనిట్ అంతా ఈ సినిమాను ఓ టార్గెట్‌గా తీసుకుని చేశామన్నారు. ఈ చిత్రం మంచివిజయం సాధించాలని కృష్ణారెడ్డి ఆశించారు.

సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. గతంలో ఈ చిత్ర దర్శకుడు తాను దర్శకత్వ శాఖలో పనిచేశామని, రమేష్ రాజా టాలెంట్ వున్నదర్శకుడని, ముమైత్‌ను మరో విజయశాంతిలా భావించవచ్చునని కొనియాడారు. అన్ని హంగులతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుందని చెప్పారు.

ముమైత్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నానని, ఈ సినిమాలో పనిచేసినఅందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ముమైత్ అన్నారు.
About Writer
SELVI.M