"ఆకాశమంత" ఆడియో రిలీజ్
|
ఈ సందర్భంగా సంగీతదర్శకులంతా మాట్లాడుతూ.. దిల్‌రాజు వంద సినిమాలు తీసినా అవన్నీ మంచి హిట్లేనన్నారు. నిర్మాతగా అన్ని శాఖల్లోనూ అవగాహన ఉన్న వ్యక్తి అని వారు కొనియాడారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. తమ బేనర్‌లో ఇది 8వ చిత్రమని, గత చిత్రాలకు పనిచేసిన సంగీత దర్శకులతో ఈ సినిమా ఆడియో విడుదల చేస్తున్నామన్నారు. ఈ చిత్ర కథ ప్రకాష్ రాజ్ "పరుగు" చిత్రం షూటింగ్‌లో చెప్పారని, ఆయన తమిళంలో ఈ సినిమాను నిర్మించారని దిల్‌రాజు చెప్పారు.
ఆ సినిమాను చూసి కొద్ది మార్పులతో తాను రీ షూట్ చేసి విడుదల చేస్తానని, అలాగే ఈ నెల 27న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలియజేశారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని దిల్‌రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.