1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

భార్గవి చివరి సినిమా "హాలీడేస్"

వినోదం వెండితెర కథనాలు భార్గవి చివరి సినిమా హాలీడేస్ కాలేజీ జీవితం శివనాగ్ సానియా కాలేజీ అనుభూతులు
WD
స్నేహాలు, ప్రేమలు, భావోద్వేగాలు లాంటి అందమైన మలుపులతో, చక్కటి సాహిత్యంతో ఇంపైన సంగీతంతో "హాలీడేస్" చిత్రం రూపొందుతోంది. ఆర్.సి.ఎం. సినీ చిత్ర పతాకంపై ఎస్.ఎస్. కుమార్ దర్శకత్వంలో ఎ. రామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓ పాట మినహా సినిమా షూటింగ్ పూర్తయింది.

మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. మిగిలిన ఓ పాటను చెన్నైలో చిత్రీకరిస్తున్నామని నిర్మాత చెప్పారు. కాలేజీ జీవితంలో ప్రతి మనిషికి ఎన్నో అనుభూతులు, అనుభవాలు జరుగుతుంటాయని, ఇదే నేపథ్యంలో ఈ చిత్రం రూపొందిందన్నారు. ఇందులో శివనాగ్, భార్గవి, సానియా హీరోహీరోయిన్లు.
About Writer
SELVI.M