"శ్రీ షిర్డి సాయిబాబా" ఆడియో విడుదల
|
పారిశ్రామిక వేత్త బి.వి.రెడ్డి సాయిబాబా పాత్రధారిగా నటిస్తూ, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కలియుగంలో భక్తులకు ప్రత్యక్ష దైవం సాయిబాబా అని, ఆయనపై ఎన్నో సినిమాలు వచ్చినా కొత్తకోణంలో ఈ చిత్రాన్ని బి.వి.రెడ్డి నిర్మించారని సుబ్బరామిరెడ్డి అన్నారు. ఆయన ప్రయత్నం సఫలం కావాలని సుబ్బరామిరెడ్డి ఆశించారు.
బి. గోపాల్ మాట్లాడుతూ.. దత్తాత్రేయ అంశంగా సాయిబాబాను చెబుతారని, అటువంటి మహనీయుడి పాత్రను బి.వి.రెడ్డి పోషించడం అభినందనీయమన్నారు. లవ్, యాక్షన్ చిత్రాలు వస్తోన్న తరుణంలో, ఆధ్యాత్మిక సినిమాలు రావడం ప్రశంసనీయమని గోపాల్ చెప్పారు.
బి.వి.రెడ్డి మాట్లాడుతూ.. షూటింగ్ పూర్తయిందని, రీరికార్డింగ్ జరుగుతుందన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.